Tuesday, November 4, 2025
E-PAPER
Homeనిజామాబాద్జూబ్లీహిల్స్ బైపోల్‌..ఇంటింటికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్ర‌చారం

జూబ్లీహిల్స్ బైపోల్‌..ఇంటింటికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్ర‌చారం

- Advertisement -

నవతెలంగాణ-డిచ్‌పల్లి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ విజ‌యం సాధిస్తార‌ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హేమావతి నగర్, శారది సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో భేటీ అవుతూ, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ“ప్రతి గల్లీ, ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొందని, ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం,” అన్నారు. గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో తీసుకువచ్చిందని అన్నారు. స్థానికంగా ఉండే వారికి ఓటేసి , కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.

ఈ కార్య‌క్రంలో డిచ్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ధర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజ్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్, మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ సర్పంచులు భాగరెడ్డి, జనార్ధన్, చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, యువ నాయకుడు రాజేష్, శ్రీనివాస్,మల్లేష్ ప్రశాంత్, వినోద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -