- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.
- Advertisement -



