Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు కోలోక‌తా వెళ్ల‌నున్న జస్టిస్‌ పీసీ ఘోష్

నేడు కోలోక‌తా వెళ్ల‌నున్న జస్టిస్‌ పీసీ ఘోష్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్ ఇవాళ‌ కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్నారు. విచారణ ముగింపు దశకు రాగా, ఈ నెలాఖరులో మళ్లీ ఆయన హైదరాబాద్‌ వచ్చి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. ఈ విడత విచారణలో కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన బ్యారేజీలకు సంబంధించి మంత్రివర్గ తీర్మానాలను, సీకెంట్‌ పైల్‌ అమలు చేసిన తీరుపై ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన వివరాలను పరిశీలించడం, నిపుణుల కమిటీ పేరుతో గ్రౌటింగ్‌ చేయాలని సూచించడంపై ఈఎన్సీ(జనరల్‌)గా పని చేసిన అనిల్‌కుమార్‌ను ప్రశ్నించారు.

మరోవైపు బడ్జెట్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తదితర వివరాలు కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖను కూడా ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం కమిషన్‌కు మరో లేఖ రాసినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -