- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ ప్రతిపాదించారు. తన ప్రతిపాదిత లేఖను ఆయన కేంద్ర న్యాయశాఖకు ఇవాళ పంపారు. నవంబర్ 23వ తేదీన బీఆర్ గవాయ్ రిటైర్‌కానున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2019, మే 24వ తేదీన సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ సూర్యకాంత్‌కు పదోన్నత లభించింది. 2027, ఫిబ్రవరి 9వ తేదీ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సుమారు 14 నెలల పాటు సేవలు అందించనున్నారు.
- Advertisement -



