Saturday, April 11, 2026
E-PAPER
Homeఖమ్మంజ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవ కారుడు

జ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవ కారుడు

- Advertisement -
  • సీఐటీయూ జిల్లా నాయకులు అర్జున్

నవతెలంగాణ-అశ్వారావుపేట: జ్యోతి రావు ఫూలే చేసిన సేవలు భారత సమాజాన్ని మార్పు వైపు నడిపించాయి అని, అందుకే ఆయనను “సామాజిక విప్లవకారుడు”గా పేరొందారని సీఐటీయూ జిల్లా నాయకులు పిట్టల అర్జున్ అన్నారు.
ఆయన జయంతి ని పురస్కరించుకొని శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో ని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ
భారతదేశంలో సమానత్వం, విద్యా విస్తరణకు ఆయన బాట చూపించారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మురహరి రఘు, హమాలి యూనియన్ నాయకులు హనుమంతరావు రాంబాబు లు పాల్గొన్నారు.

బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో …
పూలే జయంతి ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు ఎస్.కె పకీర్,అంకోలు వెంకటేశ్వరరావు, దేవరకొండ త్రినాథ్, కైలా శ్రీరాములు,మైనం రామకృష్ణ, తెలుగు పండిట్ దుర్గారావు, రిటైర్డు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు రాజేంద్ర కుమార్,మోర్ల వెంకన్న, పగిడి లక్ష్మణరావు, వీరంకి దుర్గారావు, ఆరేపల్లి వేణు, తాళం సూరిబాబు గారు కిలారి మార్కండేశ్వర,వి.వెంకటేశ్వరరావు, బూసి పాండు, నూనె హనుమంతరావు, అల్లాడి రామారావు, కూరపాటి రఘురాం తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో…
మహాత్మ జ్యోతి బా ఫూలే జయంతి వేడుకలను వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. జె. హేమంత కుమార్ మార్గ దర్శకత్వం లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సంద్భంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పి. ఝాన్సీ రాణి, డి. స్రవంతి, డాక్టర్ శ్రీ జన్ సమన్వయ భాద్యతలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం మహాత్మ జ్యోతి భా ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ సంఘంస్కర్త, విద్యా రంగ విప్లవ కారుడు, బడుగు బహీనవర్గాలకు ఆశాజ్యోతి, జ్యోతి రావు ఫూలే 1827, ఏప్రిల్, 11 న మహారాష్ట్ర లో జన్మించారు అని తెలిపారు. ఆయన కుల నిర్మూలన, స్త్రీ విద్య, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ, ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -