Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆటలుజ్యోతి యర్రాజి మీట్‌ రికార్డ్‌

జ్యోతి యర్రాజి మీట్‌ రికార్డ్‌

- Advertisement -

– మహిళల 4×400మీ. రిలే జట్టుకు స్వర్ణం
– ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌
గుమీ(దక్షిణకొరియా):
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు మూడోరోజు పతకాల పంట పండించారు. ఏకంగా మూడు స్వర్ణ పతకాలతోపాటు… జ్యోతి యర్రాజి 100మీ. హార్డిల్స్‌లో 12.96సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్‌ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మూడోరోజు పోటీలు ముగిసేసరికి భారత్‌ పతకాల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. 3వేల మీ. స్టీపుల్‌ ఛేస్‌లో అవినాశ్‌ సెబ్లే 36ఏళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఇక జ్యోతి యర్రాజి 100మీ. హార్డిల్స్‌లో 12.96సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్‌ రికార్డును నెలకొల్పింది. అలాగే మహిళల 4×400మీ. రిలే బృందం జిస్నా, రుతుల్‌, కుంజ, శుభలతో కూడిన భారతజట్టు 3నిమిషాల 34:18సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకాన్ని చేజక్కించుకోగా.. ఈ విభాగంలో వియత్నాం(3:34.77సెకన్లు), శ్రీలంక(3:36.67సెకన్లు) రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నాయి. అంతకుముందు పురుషుల 4×400మీ. రిలే జట్టు రజత పతకం సాధించగా.. పురుషుల లాంగ్‌జంప్‌లో అన్రిచ్‌ సాజన్‌(6.33మీ.), షైలీ సింగ్‌(6.30మీ.) రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. ఇక 10వేల మీ. రిలే పరుగులో డైసే విజేత నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ప్రవీణ్‌ చిత్రవేల్‌ ట్రిపుల్‌ జంప్‌లో 16.90మీ. దూకి రజత పతకాన్ని సాధించాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad