నవతెలంగాణ-హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఉత్తమ చిత్రంగా ‘క’ అవార్డును సొంతం చేసుకుంది. ఒక తెలుగు సినిమాకు ఈ అవార్డ్ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాదిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం, విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన హిట్‌గా నిలిచింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను ఫాంటసీ థ్రిల్లర్ శైలిలో రూపొందించారు.
‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఉత్తమ చిత్రంగా ‘క’
- Advertisement -
RELATED ARTICLES