Tuesday, December 9, 2025
E-PAPER
Homeక్రైమ్మహారాష్ట్రలో కబడ్డీ ప్లేయర్ ఆత్మ‌హ‌త్య‌

మహారాష్ట్రలో కబడ్డీ ప్లేయర్ ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ప్లేయర్ కిరణ్ సూరజ్ దాధే ఆత్మహత్య చేసుకుంది. కిరణ్ సూరజ్ దాధే.. 2020లో స్వప్నిల్ జయదేవ్ లాంబ్‌ఘరేని వివాహం చేసుకుంది. కిరణ్.. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి వివాహం చేసుకున్నాడు. కానీ నాటి నుంచి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. మానసికంగా..శారీరికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల దగ్గర నివాసం ఉంటుంది. భర్త నుంచి వేధింపులు ఎక్కువ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై డిసెంబర్ 4న విషం సేవించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -