నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పీ గారేపల్లి మండలం కాటారం మంథని రోడ్డులో “కాకా ఫ్యాషన్స్” దుస్తుల దుకాణం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాకా ఫ్యాషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పల్లకొండ శ్రీకాంత్ మాట్లాడుతూ యువతకు అవసరమైన నూతన ఫ్యాషన్ దుస్తులను అందించాలనే లక్ష్యంతో కాకా ఫ్యాషన్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో వస్తున్న తాజా ట్రెండ్‌లకు అనుగుణంగా ఫ్యాషన్ దుస్తులను సేకరించి కాటారం ప్రాంత యువతకు అందుబాటులో ఉంచుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి తల్లిదండ్రులు సమ్మక్క, సమ్మయ్య, ఆయా సంఘాల అధ్యక్షులు కేతిరి బిక్షపతి, చిర్ర గణేష్, మామిళ్ళ సంపత్, రవిశెట్టి రాజేందర్, పిట్టల కేశవులు, అంగిడి ప్రశాంత్, సుల్తాన్ సందీప్, కేతిరి గణేష్, దుగ్యాల సదానందం తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, యువకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



