- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.
- Advertisement -