Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయం‘క‌ల్తీ ద‌గ్గు మందు’..సుప్రీంకోర్టులో పిటిషన్

‘క‌ల్తీ ద‌గ్గు మందు’..సుప్రీంకోర్టులో పిటిషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌ల్తీ ద‌గ్గు మందుతో రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప‌లువురు చిన్నారులు మృత్య‌వాత ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో తాజాగా చిన్నారుల మరణాల ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.అడ్వకేట్ విశాల్ తివారీ ఆర్టికల్ 32 కింద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేస్తూ, డయీథిలీన్ గ్లైకాల్ (DEG) కలిగిన దగ్గుమందు వల్ల 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో ఉపయోగించిన దగ్గు మందులో డయీథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పారిశ్రామిక విషపదార్థం ఉన్నట్లు బయటపడింది. ఇది ఔషధ తయారీలో వాడటం నిషేధిత రసాయనం అని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే తమిళనాడు ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. తమిళనాడు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నివేదికలో తయారీ స్థలాల్లో అపరిశుభ్ర వాతావరణం, బ్యాచ్ నంబర్ల లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దగ్గు మందుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -