- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత గురువారం మాజీ మంత్రి హారీశ్ రావు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణించగా.. కుటుంబానికి మద్దతుగా, కల్వకుంట్ల కవిత అక్కడికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్శనలో ఆమె సంతాపం తెలిపారు. ఇక కొన్ని రోజులుగా కవిత, హరీశ్ రావు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
- Advertisement -



