- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటిదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తెలిపారు డోంగ్లి మండలానికి మంజూరైన ఎనిమిది కల్యాణ లక్ష్మి చెక్కులు అలాగే నాలుగు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం నాడు పంపిణీ చేశారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం డోంగ్లి మండలంలోని ఈలేగావ్ గ్రామంలో చేపట్టారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డోంగ్లి మండల తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ ఐ సాయిబాబా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు
- Advertisement -