Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్..

ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్..

- Advertisement -
  • – కాంగ్రెస్ మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తాద్రి..
    నవతెలంగాణ – డిచ్ పల్లి

     రాంపూర్ గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తాద్రి తెలిపారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నీయోజకవర్గం లోని అన్ని మండలాలకు చెక్కులను అందజేసినట్లు లచ్చమోల్ల దత్తాద్రి వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ అన్నారు.గతం కంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే త్వరితగతిన చెక్కులు మంజురై లాబ్దిదారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, చిన్నాన్న,గౌరవ అధ్యక్షులు నంబర్ రాజన్న, యూత్ అధ్యక్షులు నర్సాగౌడ్, విజయ్, సిరం నర్సయ్య, సందీప్ కిషన్ ఈర్ల లింగన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -