Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంకమల్‌ హాసన్‌కు చరిత్ర తెలిదు: సీఎం సిద్ధరామయ్య

కమల్‌ హాసన్‌కు చరిత్ర తెలిదు: సీఎం సిద్ధరామయ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నటుడి తీరును కర్ణాటకలోని కాంగ్రెస్‌, బీజేపీ ముక్తకంఠంతో ఖండించాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్‌కు చరిత్ర గురించి తెలియదంటూ విమర్శించారు. కమల్‌హాసన్‌ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో కమల్‌ కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్న విష‌యం తెలిసిందే.

ఇటీవల చెన్నైలో ‘థగ్‌లైఫ్‌’ మూవీ ఆడియో కార్యక్రమానికి కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కమల్‌ ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం, తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -