బెంగళూరు : ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇటీవల కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కమల్‌హాసన్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే కర్నాటకలో తాను తాజాగా నటించిన ‘థగ్ లైప్’ మూవీ విడుదలను అడ్డుకుంటామని చెప్పాయి. దీంతో జూన్ 5న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో.. కర్ణాటకలో కూడా ఈ సినిమా విడుదల చేయాలని కోరుతూ కమల్‌హాసన్ సోమవారం కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. కమల్‌హాసన్ తన కంపెనీ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సిఇఓ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. థగ్ లైఫ్ మూవీని కర్నాటక రాష్ట్రంలో విడుదల చేసేందుకు కర్నాటక ప్రభుత్వం గానీ, పోలీసు శాఖ, ఫిల్మ్ చాంబర్‌లు సినిమా ప్రదర్శనను నిలిపివేయకుండా నిరోధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు సరైన భద్రత కల్పించాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
కాగా, నటుడు కమల్‌హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) అధ్యక్షుడు నరసింహులు డిమాండ్ చేశారు. ‘మేము కమల్‌హాసన్‌కి 24 గంటలు సమయం ఇచ్చాము. ఆయన క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదల కానివ్వం’ అని కెఎఫ్‌సీసీ సభ్యుడు గోవిందు అన్నారు.
కర్నాటక హైకోర్టునుఆశ్రయించిన కమల్‌కహాసన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



