- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ఆయన ప్రమాణం చేశారు. కాగా, జూన్‌లో డీఎంకే కూటమి మద్దతుతో కమల్ రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ఎంపీలుగా ఎన్నికయ్యారు. వారు కూడా తాజాగా ప్రమాణస్వీకారం చేశారు.
- Advertisement -