నిరంతరాయంగా రోడ్డుపైనే ఇసుక లారీలు..
బయటికి వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు..
ఇసుక లారీలను కట్టడి చేయాలని గ్రామస్తులు రాస్తారోకో
నవతెలంగాణ – మణుగూరు
నిరంతరాయంగా ఇసుక లారీలు రోడ్డుపై వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు జీవిస్తున్నారు. నిరాశకు గురైన కమలాపురం గ్రామస్తులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కమలాపురం, రాయి గూడెం ఇసుక రాంపుల నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్నారు. ప్రజలు రోడ్డుపై ఎక్కాలంటే భయపడుతున్నారు. క్షణం క్షణం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు తదితర జంతువులు కూడా మృత్యువాత గురవుతున్నాయి. ఊపిరి ఆడకుండా దుమ్ము ఇండ్లపై కమ్ముకుంటుంది. ట్రాక్టర్లతో ఆరకొరగా నీటిని చల్లుతున్నారు. విపరీతమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోతుంది. దుబ్బ అలుముకుంటుంది. దీంతో ప్రజలకు ఊపిరి అందడం లేదు ఎన్ని బాధలు ఉన్న తమ ఉపాధి లభిస్తుందని ఆశతో ఎదురుచూసిన గ్రామస్తులకు నిరాశ ఎదురైంది. ఇసుక లారీలకు పైన తార్బాల్ కట్టేందుకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపారు నెలలు గడుస్తున్నా ఉపాదా అవకాశాలకు అవకాశం ఇవ్వలేదని గ్రామస్తుల ఆవేశానికి గురయ్యారు. కమలాపురం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఇసుక లారీలను అరికట్టాలని డిమాండ్ చేశారు .రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ , మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు స్పందించాలని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇసుక లారీలను అడ్డుకున్న కమలాపురం గ్రామస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES