నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆర్టిజన్ల శాంతియుత నెరవేదిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ నీ కామారెడ్డి పట్టణంలోని ఆయన నివాసంలో ఆర్టిజన్ జాక్ నాయకులు, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి నివాసానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారులు స్పందిస్తూ, రెండు రోజుల్లోనే రాష్ట్ర ఆర్టిజన్ జాక్‌ను,సీఎం వద్దకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారులు కలిసిన వారిలో, జిల్లా కన్వీనర్ హరికృష్ణ. చైర్మన్, పి.భీమ్రాజ్. జిల్లా సీనియర్ అడ్వైజర్,ఎం.నాంపల్లి. జయసింహారెడ్డి. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టా గౌడ్, డివిజన్ చైర్మన్ సునీల్ కుమార్ గౌడ్, స్వామి, రఘు చరణ్, జిల్లాలోని, ఆర్టిజన్స్, సీఎల్. కంప్యూటర్ ఆపరేటర్స్, హనుమాన్, లతోపాటు విద్యుత్ కార్మికులు పాల్గొని 5వ రోజు నిరవధిక శాంతియుత మహాధర్నాను, విజయవంతం చేశారు.



