నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ఐఎంఏకు ఆల్ రౌండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు వచ్చినట్లు ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ గౌడ్ తెలిపారు. ఈ  మేరకు కరీంనగర్ ఐఎంఏ స్టేట్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఐఎంఏ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో అవార్డును సోమవారం బ్రాంచ్ ప్రతినిధులు అందుకున్నారు.కామారెడ్డి ఐఎంఏ అధ్యక్షురాలు డా. రాధా విజయలక్ష్మి, సెక్రెటరీ డా. అరవింద్ గౌడ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్, 2024-2025 సంవత్సరంలో తమ పనితీరుకు ఆల్రౌండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డును గెలుచుకోవడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ఐఎంఏ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పర్కొన్నారు.
ఆల్ రౌండ్ బెస్ట్ అవార్డున అందుకున్న కామారెడ్డి ఐఎంఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

