నవతెలంగాణ-హైదరాబాద్: నేపాలీ షెర్పా, ప్రఖ్యాత పర్వతారోహకుడు కామి రిటా చరిత్ర సృష్టించాడు. ఎవరెస్టు శిఖరాన్ని అతను 31వ సారి ఎక్కాడు. అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన రికార్డును నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కామిరిటా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్టును ఎక్కాడు.
గత రెండేళ్ల నుంచి ట్రెక్కర్ కామి రిటా ప్రతి సీజన్‌లో రెండు సార్లు మౌంట్ ఎవరెస్టును అధిరోహించాడు. ఈసారి భారతీయ సైన్యానికి చెందిన దళాన్ని కామి రిటా తీసుకెళ్లాడు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్, 14 పీక్స్ ఎక్స్‌పెడిషన్‌లో సీనియర్ గైడ్‌గా కామి రిటా చేస్తున్నాడు. నేపాల్‌లోని సోలుకుంబ్ సమీపంలోని థామే గ్రామంలో జిన్మించాడు. పర్వతారోహణకు అతను జీవితాన్ని అంకితం చేశాడు. 1970, జనవరి 2వ తేదీన అతను పుట్టాడు. చిన్నతనం నుంచి పర్వతాలు ఎక్కాలన్న తపనతో పెరిగాడు. గత రెండు దశాబ్ధాల నుంచి కామి రిటా పర్వతాలను అధిరోహిస్తున్నాడు.