నవతెలంగాణ-హైదరాబాద్: కన్నడ నటుడు దర్శన్‌కి బెయిల్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. బెయిల్ మంజూరు విచారణ, సాక్షులను ప్రభావితం చేయవచ్చని జస్టిస్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ జె.మహదేవన్ తీర్పు.. నిందితుడు ఎంతటి వాడైనా చట్టానికి అతీతులు కారనే సందేశాన్ని ఇస్తుందని జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించారు. రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో దర్శన్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీం కోర్టులో కన్నడ నటుడు దర్శన్‌కి భారీ షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES