– అయితే కోఫోపోసా కేసులో జైలులోనే
బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులు కన్నడ నటి రన్యారావు, తరుణ్ కొండూరు రాజులకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ మంజారు చేసింది. ఒక్కొక్క రికి రూ. 2 లక్షల వ్యక్తిగత బాండ్, ఇద్దరు పూచీ కత్తులతో ఈ డిఫాల్ట్ బెయిల్‌ను కోర్టు జారీ చేసింది. అలాగే, విచారణ జరిగే అన్ని తేదీల్లోనూ తప్పకుండా హాజరుకావాలని, సాక్షులను తారు మారు చేయకూడదని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, భవిష్యత్‌లో నేరాలకు పాల్పడకూడదని షరతులు విధించింది. ఈ షరతులును ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న దుబారు నుంచి వచ్చిన రన్యా రూ. 12.56 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) రన్యాను అరెస్టు చేసింది. అలాగే ఆభరణాల వ్యాపారి రాజు, సాహిల్ సకారియా జైన్ల కూడా అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురూ బెంగళూరు లోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. కాగా, బం గారం స్మగ్లింగ్ కేసులో రన్యాకు బెయిల్ మంజూ రయినా ప్రస్తుతం ఆమె విడుదల అసాధ్యం. ఎందుకంటే రన్యాతో సహా ముగ్గురిపైనా కేంద్ర ప్రభుత్వం కఠినమైన విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యాకలాపాల నిరోధక చట్టం (కోఫెపోసా) కేసును ఏప్రిల్ 22న నమోదు చేసింది. ఈ కేసులో అనుమానితుడ్ని దాదాపు ఒక ఏడాది బెయిల్ లేకుండా నిర్భం ధించవచ్చు. అయితే రాన్యాపై కోఫెపోసా కేసును నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె తల్లి కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ మూడుకి వాయిదా వేసింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెయిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES