Tuesday, June 17, 2025
E-PAPER
Homeసినిమా'కన్నప్ప' అద్భుతం : రజనీకాంత్‌

‘కన్నప్ప’ అద్భుతం : రజనీకాంత్‌

- Advertisement -

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని, నాటి జ్ఞాపకాల్ని రీ కాల్‌ చేసుకున్నారు. జూన్‌ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్న క్రమంలోనే రజనీకాంత్‌ ‘కన్నప్ప’ సినిమాను కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా వీక్షించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడారు. ఈ మేరకు విష్ణు మంచు సోషల్‌ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ”కన్నప్ప’ చిత్రాన్ని రజినీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను.. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు. మోహన్‌ బాబు కూడా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ,’జూన్‌ 15కి ‘పెద రాయుడు’ రిలీజై 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని చూశారు. సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -