హీరో విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఎం.మోహన్ బాబుతో ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అక్షరు కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈనెల 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మోహన్ బాబు మాట్లాడుతూ, ‘కన్నప్ప’ సినిమాని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాము. ఎలా ఉంటుంది అనేది సినిమానే మాట్లాడుతుంది. నా కంటే చిన్నవాడు, నా భావ ప్రభాస్‌కు హదయపూర్వకంగా కతజ్ఞతలు. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. మోహన్‌లాల్ వర్సటైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగ్గ నటుడు. శరత్ కుమార్, అక్షరు కుమార్, బ్రహ్మానందం.. ఇలా అందరినీ ఆ భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడు. ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్‌గా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఈనెల 27న రాబోతున్న మా చిత్రాన్ని ఆశీర్వదించండి’ అని అన్నారు.
”కన్నప్ప’ ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి, నేను ఇక్కడ నిలబడటానికి చాలామంది సాయం చేసారు. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్రహ్మానందం ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. ప్రభుదేవా తన పనులన్నీ మానుకొని ఈ సినిమాకి మూడు పాటలు చేశారు. డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. ఇలా.. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. నా మిత్రుడు ప్రభాస్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. దేవుడికి దాసోహం అవుతాం. ఈ సినిమా కూడా అంతే. దాదాపు 50 ఏళ్ళ తర్వాత ‘కన్నప్ప’ కథను చిత్రీకరించాం. ఈ కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా’ అని విష్ణు మంచు చెప్పారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ,’ఈ చిత్రంలో విష్ణు అద్భుతంగా ఉన్నారు. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతగా మోహన్ బాబు పేరు ఉంటుంది.. కానీ నిర్మాతగా, హీరోగా విష్ణు చాలా కష్టపడ్డారు. మోహన్ లాల్, అక్షరు కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి వారు అద్భుతంగా నటించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శివాజ్ఞతోనే ‘కన్నప్ప’ సాధ్యమైంది : మోహన్‌బాబు
- Advertisement -
- Advertisement -