Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుKantara Chapter 1: అదిరిపోయే లుక్ లో రిషబ్ శెట్టి

Kantara Chapter 1: అదిరిపోయే లుక్ లో రిషబ్ శెట్టి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న‌ అభిమానులకు మేక‌ర్స్ అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి వీరోచితమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఆయన ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఈ కొత్త పోస్టర్‌లో ఆయన పవర్‌ఫుల్ అవతారం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -