నవతెలంగాణ – హైదరాబాద్: 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా పరంపరలో తదుపరి రాబోతున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఉత్కంఠను మరింత పెంచుతూ, ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో తెరకెక్కుతున్న ప్రీక్వెల్ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో ‘పంజుర్లి’కి సంబంధించిన సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నాయనడంలో సందేహం లేదు. రుక్మిణి వసంత్ మహారాణి పాత్రలో చాలా అందంగా కనిపించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ మరోసారి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా మరో స్థాయిలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.
కాంతార చాప్టర్ 1 ట్రైలర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES