- Advertisement -
బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజాలను నిగ్గు తేల్చే కరదీపిక నవతెలంగాణ దిన పత్రిక అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. పత్రిక పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేరవేస్తూ… ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా తన విధులను బాధ్యతగా నిర్వహిస్తోందని కొనియాడారు. భవిష్యత్‌లో మరింతగా సమాజహితమైన మెరుగైన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
- Advertisement -