Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంవెలుగులోకి క‌ర్నాట‌క డీజీపీ రాస‌లీల‌లు..వీడియో

వెలుగులోకి క‌ర్నాట‌క డీజీపీ రాస‌లీల‌లు..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కర్ణాటక రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియా ఒకటి కలకలం రేపుతోంది. డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డా. రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే, రామచంద్రరావు.. ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. సదరు మహిళ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో అసభ్యకరంగా తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశారు. అయితే, ఇదంతా డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రికార్డు చేసినట్టు తెలిసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఈ వీడియోలపై అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారి రామచంద్రరావు స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఈ వీడియోని తనకు గిట్టని వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారని ఆరోపించారు. కాగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు తండ్రి కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -