Thursday, July 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసినిమా టికెట్లు పెంపు విష‌యంలో క‌ర్నాట‌క వినూత్న నిర్ణ‌యం

సినిమా టికెట్లు పెంపు విష‌యంలో క‌ర్నాట‌క వినూత్న నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సినిమా టికెట్లు పెంపు విష‌యంలో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.మూవీ టికెట్ ధర గరిష్టంగా రూ.200 మించకూడదని స్పష్టం చేసింది. ఈమేర‌కు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిమితి రాష్ట్రంలోని అన్ని థియేటర్లకూ, మల్టీప్లెక్స్‌లకూ వర్తించనుంది. ఈ నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ప్రజలందరికీ సినిమాలు చేరువ కావాలి. టికెట్ ధరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. గతంలో కొన్ని మల్టీప్లెక్స్‌లలో టికెట్లు 500 నుంచి 1000 దాకా ఉంటున్నాయి. ఇది సరైనది కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఇది ముసాయిదా నోటిఫికేషన్ కావడంతో, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలిపేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -