Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామాలయంలో కార్తీక వన భోజనాలు 

రామాలయంలో కార్తీక వన భోజనాలు 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల కేంద్రంలోని రామాలయంలో ఆదివారం కార్తీకమాన భోజనాల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్మాణ ప్రదాత మామునూరి పిచ్చయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ప్రధమంగా ప్రజల కోసం సొంత నిధులతో రామాలయాన్ని పిచ్చయ్య  నిర్మించారని అన్నారు. అనంతరం పూజాత కార్యక్రమాలు రామాలయంలో నిర్వహించి భక్తులకు కార్తీక మాస ఉసిరి చెట్టు కింద వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ఆలయ కమిటీ సభ్యులు శ్రీకాంత్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -