Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకార్తీ కొత్త చిత్రం ‘మార్షల్‌’

కార్తీ కొత్త చిత్రం ‘మార్షల్‌’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళ హీరో కార్తీ తన కెరీర్‌లో 29వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘మార్షల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. గురువారం చెన్నైలో ఈ సినిమా ప్రారంభమైంది. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా తనక్కారన్‌ డైరెక్ట్‌ చేసిన యంగ్‌ దర్శకుడు ‘తమిళ’ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి అభ్యంకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో నిర్మించాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. ఈ సినిమా కథ రామేశ్వరం నేపథ్యంలో సాగనుందని చెబుతున్నారు. దీంతో మెజారిటి పోర్షన్‌ సముద్రం లొకేషన్స్‌ షూట్‌ చేస్తారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -