Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంకరూర్‌ తొక్కిసలాట..సీబీఐ ముందుకు విజ‌య్

కరూర్‌ తొక్కిసలాట..సీబీఐ ముందుకు విజ‌య్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగమ్‌ (టివికె), నటుడు విజయ్‌ సిబిఐ విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం సోమవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కరూర్‌ తొక్కిసలాటలో 41మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తు పలు మలుపులు తిరిగింది. ప్రారంభంలో.. ఈ ఘటనపై విచారణ కోసం మద్రాస్‌ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటి) ఏర్పాటు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణను పర్యవేక్షించాలని ఆదేశించింది. స్వతంత్ర, పారదర్శకతతో కూడిన దర్యాప్తు అవసరమనే వాదనతో ఏకీభవిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం గతంలో నియమించిన ఏకసభ్య కమిషన్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిబిఐ అధికారులు నటుడు విజయ్‌కి సమన్లు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -