నవతెలంగాణ-హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు టివికె చీఫ్ విజయ్ ఆదివారం రేపు కలవనున్నారు. అయితే బాధిత కుటుంబాల ఇంటింటికి వెళ్లి కాకుండా అందరినీ ఒక ప్రత్యేక వేదికపై విజయ్ కలవనున్నట్లు టివికె పార్టీ శనివారం ప్రకటించింది. దీనికోసం ధర్మపురి జిల్లాలో ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. అయితే విజయ్ బాధితులను కలిసే సమయంలో గతంలో మాదిరిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని, వేదిక నుంచి ఒక కిలోమీటరు మేర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని టివికె పార్టీ డిఎంకె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కరూర్ తొక్కిసలాట..బాధిత కుటుంబాలను కలవనున్న విజయ్
- Advertisement -
- Advertisement -