– అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి సారిస్తా
– బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ ఛైర్ పర్సన్ అభ్యర్థిని,8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాసాని నాగశేషపద్మ ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఆదివారం ఆమె తన వార్డు తో పాటు ఇతర వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాం లో ప్రారంభమైన అభివృద్ధి పనులు ను కాంగ్రెస్ రెండేళ్ల తర్వాత సైతం పూర్తిస్థాయిలో చేయలేకపోయింది అని తెలిపారు.
ఛైర్ పర్సన్ పదవి చేపట్టిన తొలి రోజు నుంచే అశ్వారావుపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కి శ్రీకారం చుడతామని ఓటర్లు కు హామీ ఇచ్చారు.ముందు స్థానిక క్రైస్తవ చర్చి లో ఉదయపు ప్రార్థన లో పాల్గొని ఏసుక్రీస్తు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



