Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్టెన్త్ లో కాటాపూర్ హైస్కూల్ ఘనవిజయం..

టెన్త్ లో కాటాపూర్ హైస్కూల్ ఘనవిజయం..

మండల టాఫర్ గా కాట శ్వేత 
సెకండ్ నిజాముద్దీన్, గండు దీక్షిత 
జిల్లాలో మారు మ్రోగిన కాటాపూర్ హైస్కూల్ టెన్త్ ఫలితాలు
మంత్రి సీతక్క, కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం 
నవతెలంగాణ – తాడ్వాయి 

టెన్త్ ఫలితాల్లో మండల టాఫర్ గా నిలిచి కాటాపూర్ హైస్కూల్ ఘనవిజయం సాధించింది. పది పలితాల్లో విద్యార్థులు 600 లకు కాట శ్వేత 555 సాదించి మండల టాపర్ గా విజయ దుందిభి మోగించారు. ముగ్గురు విద్యార్థులు కాటా శ్వేత 555/600, ఎస్.కె నిజాముద్దీన్ 548/600, గండు దీక్షిత 538/600 ముగ్గురు ఘన విజయం సాధించారు. వీరిని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ లు విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, ఉపాధ్యాయ బృందాన్ని, తల్లిదండ్రులను కూడా ఘనంగా అభినందించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు.ఈ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. పేద విద్యార్థులు. వీరికి ప్రభుత్వ సహాయంతో ఉన్నత విద్య ను చదివి మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజాసేవ చేస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img