నవతెలంగాణ – ఆలేర్ రూరల్
పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కట్ట రాజిరెడ్డి అన్నారు.శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోడం రమాదేవి అధ్యక్షతన ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని గతంలో తాను మాట ఇచ్చినట్లు పదోతరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన గజరాజు ప్రణయ్ కు పదివేల బహుమతిని, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైన మహంకాళి ఉదయ్ కి ఐదువేల రూపాయలను అందించారు. అనంతరం పాఠశాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయులు కోడం రమాదేవి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న చే అందజేయబడిన షూస్ ను విద్యార్థులందరికీ అందజేయమైనది. ఆ తర్వాత విద్యార్థులచే ప్రదర్శింపబడిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కుమారు, శ్రీనివాసు, కుమారస్వామి, ఖాజా అలీ, లింగయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, సభ భావన సంఘాల మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి కట్టా రాజిరెడ్డి సహకారం
- Advertisement -
- Advertisement -