Friday, June 6, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్తగా 'కట్టప్ప జడ్జిమెంట్‌'

సరికొత్తగా ‘కట్టప్ప జడ్జిమెంట్‌’

- Advertisement -

అపోలో ప్రొడక్షన్స్‌ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మాతగా ‘బాహుబలి’ కట్టప్ప సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కట్టప్ప జడ్జిమెంట్‌’. ‘తీర్పుగల్‌ విర్కపడుమ్‌’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కట్టప్ప జడ్జిమెంట్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత వెంకటస్వామి. ‘బాహుబలి’ కట్టప్ప అంటే తెలుగులో తెలియని ప్రేక్షకులు ఉండరు. అంతలా తెలుగు ప్రేక్షకులతో సత్యరాజ్‌కి మంచి అనుబంధం ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్‌ సొంతం చేసుకుంది. ఈనెల 13న తెలుగులో విడుదల చేయడానికి నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ప్రత్యర్థి పాత్రలో మధుసూదనరావు అద్భుతంగా నటించారు. పూర్తి మాస్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ‘కట్టప్ప’ ఏ విషయంలో, ఎలాంటి జడ్జిమెంట్‌ ఇచ్చాడో వెండితెరపై చూస్తే థ్రిల్‌ అవుతారు. ఈ చిత్రానికి ధెరన్‌ దర్శకత్వం వహించారు. స్మ్రుతి వెంకట్‌, సత్యరాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, రవిప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషించారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -