- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు మీడియాతో మాట్లాడనున్నారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మ.12 గం.కు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అందులో ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం అవినీతిపై మరిన్ని వివరాలు చెబుతారా, హరీశ్ రావును మరోసారి టార్గెట్ చేస్తారా అనేది చూడాలి.
- Advertisement -