- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్‌కు కల్వకుంట్ల కవిత రాసిన లేఖను బయట పెట్టాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్ సామా రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే ఆమెను ప్రజలు నమ్ముతారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లా డారు. రానున్న రోజుల్లో కొత్త పార్టీ పెట్టాలనే ఆమె ఆలోచనను స్వాగతి స్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మహిళలకు, బీసీలకు అన్యాయం జరిగిందంటూ కవిత ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. పదేండ్లల్లో సామాజిక తెలంగాణ నిర్మించ లేకపోయామంటూ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి పాలనపై ఆమె తన అసంతృప్తిని బాహాటంగా తెలపటం మంచి పరిణామమని చెప్పారు.
- Advertisement -