Tuesday, December 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కేసీఆర్ కీలక నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కేసీఆర్ కీలక నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ మరియు శాసన మండలిలో పార్టీ తరఫున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను కేసీఆర్ నియమించారు.

అలాగే, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, ఉభయ సభల్లో పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -