Tuesday, April 29, 2025
Homeకరీంనగర్తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన కేసీఆర్

  • తోడేటి శంకర్ గౌడ్ టిఆర్ఎస్(డి) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

-డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు
– టిఆర్ఎస్ డి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు
నవ తెలంగాణ- గోదావరిఖని

వరంగల్ లో నిన్న జరిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకకు 100 కోట్లకు పైగా ఖర్చుచేసి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్పంచుకున్నటువంటి ఉద్యమకారుల కోసం ఏ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం అని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు ఇరువురు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గత 24 సంవత్సరాలుగా అప్పటి టిఆర్ఎస్ పార్టీలో నాటినుండి నేటి వరకు కొనసాగుతూ.. పార్టీలకు అతీతంగా కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటూ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గౌరవ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర్య సమరయోధులు లాగా ఉద్యమకారులను గుర్తించి ప్రతి ఒక్కరికి 5000 నుండి 10000 రూపాయల పెన్షన్, ఇంటి జాగా తదితరవి వచ్చే విధంగా.. అధికారంలోకి రాగానే ఇవన్నీ అమలు చేసుకుందామని హామీలు ఇచ్చి టిఆర్ఎస్ పార్టీ రాజతోత్సవ సభ సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ తదితర పథకాలు ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేస్తామని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగాహామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కూడా సంవత్సరన్నర కాలం గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క ఉద్యమకారుల్ని కూడా గుర్తించి వారికి న్యాయం చేయను చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img