Tuesday, October 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలువచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుంది: కేటీఆర్‌

వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుంది: కేటీఆర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్ లోని సున్నం చెరువు ప్రాంతాన్ని కేటీఆర్‌ పరిశీలించారు. హైడ్రా బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతానికి వెళ్లారు. కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ వాసులతో మాట్లాడి ప్లాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హైడ్రా బాధితులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేకుండా చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టింది. హైదరాబాద్‌లో హైడ్రా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుంది. ఇంకో రెండేళ్లలో తెలంగాణ మళ్లీ వెలుగులు చూడొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపుర్‌ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -