Saturday, August 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ

- Advertisement -

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం తీర్పు
కాళేశ్వరంపై ఘోష్‌ కమిషన్‌ నివేదికపై చర్చ
నవతెలంగాణ-మర్కుక్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్యనేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన ప్రధానంగా చర్చించినట్టు తెలు స్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక, గురువారం నాటితో పి.జస్టిస్‌ చంద్రఘోష్‌ కాళేశ్వరం కమిషన్‌ గడువు ముగిసి.. ప్రభుత్వానికి రిపోర్టు అందించ డంతో వారి సమావేశంలో దీనిపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో లోపాలకు తామే కారణమని కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ఇస్తే.. ప్రభు త్వంపై ఎలా కౌంటర్‌ అటాక్‌ చేయాలనే దానిపై సమాలో చనలు చేసినట్టు తెలు స్తోంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పార్టీ సన్నద్ధత, అభ్యర్థి ఎంపికపై హరీశ్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, కేటీఆర్‌ తమ అభిప్రాయాలను కేసీఆర్‌తో పంచుకున్నట్టు తెలుస్తోంది. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులను యాక్టివ్‌ చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -