Tuesday, October 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాగంటి సునీతా గోపీనాథ్‌కు బీ-ఫామ్ అంద‌జేసిన కేసీఆర్

మాగంటి సునీతా గోపీనాథ్‌కు బీ-ఫామ్ అంద‌జేసిన కేసీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈనెల 11న జూబ్లీహిల్స్ నియోజకవ‌ర్గానికి ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలో BRS అభ్య‌ర్థిగా మాగంటి గోపినాథ్ భార్య సునీతా పేరు ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మాగంటి సునీతా గోపీనాథ్‌ కు పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును కూడా అందించారు.

ఈ సందర్భంగా మాగంటి సునీతా గోపినాథ్‌ వెంట ఆమె కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరుగుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -