నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాజీ మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని, ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణ కోసం ఆనాడు అధికార పార్టీలో ఉండి నేను సస్పెండ్ అయ్యానని గుర్తు చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో వైసీపీ కి 11 సీట్లు వచ్చాయి.. వారికి ప్రతిపక్ష హోదా లేదన్నారు. మేము మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం..కేసీఆర్ ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తాం అని అన్నారు.

మేము మంచి పనులు చేసినవి కేసీఆర్ చెబితే ఆయనకే గౌరవం పెరుగుతుందని, కేటీఆర్ మూసిపై ప్రజంటేషన్ ఇస్తే నవ్వు వస్తుందన్నారు. మూసితో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫ్లోరైడ్ సమస్యతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో నల్గొండ ప్రజలకు తెలుసన్నారు. ఆనాడు కేసీఆర్ ఇచ్చే దొడ్డు బియ్యం ఎవ్వరు తినలేదు…రేషన్ డీలర్లకే అమ్ముకున్నారు. మేము తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.



