నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జులా రాజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చడం, మిఠాయిలు పంపిణీ చేయడం ద్వారా కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, సర్పంచ్ లు దేవ రాజు,సుధాకర్, మాజి జడ్పీ కో ఆప్సన్ చాంద్ పాషా, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, వడ్డెర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, సీనియర్ మండల నాయకులు భగ వంతం, శ్రీరామ్, రవి ,దేవ రాజు, భాస్కర్, తిరుపతి రెడ్డి, లింబయ్య , రామస్వామి,లింబద్రి, ఉస్మాన్, భారత్, మోహన్, నాగరాజు, శేఖర్, ఎల్లయ్య, రామ్ రెడ్డి, పృధ్వీ, రాజు, రాములు, విష్ణు, తులసి రామ్, మహిపాల్,తదితరులు పాల్గొన్నారు.



