Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్Zee Bharat Ki Udaan Award: జి భారత్ కి ఉడాన్ అవార్డు అందుకున్న కెడిఎం

Zee Bharat Ki Udaan Award: జి భారత్ కి ఉడాన్ అవార్డు అందుకున్న కెడిఎం

- Advertisement -

నవతెలంగాణ ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవనశైలి & మొబైల్ ఉపకరణాల బ్రాండ్ అయిన కెడిఎం, జీ భారత్ కార్యక్రమం ‘భారత్ కి ఉడాన్’లో రోడ్డు రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ నుంచి భారత్ కా ఛార్జర్ మహా కుంభ్ కార్యక్రమానికి గాను ‘జీ భారత్ కి ఉడాన్ అవార్డు’ను అందుకుంది.

భక్తులకు మొబైల్ ఛార్జింగ్ పరంగా మద్దతును అందించడానికి 1080మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా 2025 మహా కుంభ్‌లో కెడిఎం చూపిన ప్రభావా

కెడిఎం వ్యవస్థాపకుడు ఎన్డి మాలి మాట్లాడుతూ, “నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ‘జీ భారత్ కీ ఉడాన్ అవార్డు’ అందుకోవడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ఇది భారత్ కా ఛార్జర్ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాకు ఉత్సాహం, ప్రేరణనిస్తోంది. భారత్ కా ఛార్జర్ కార్యక్రమం వినూత్న ఆలోచన , సామాజిక బాధ్యతకు ఒక ఉదాహరణ. నేడు, మొబైల్ ఫోన్లు ‘వృద్ధి కి సాధనాలు’, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి. కెడిఎం భారత్ కా ఛార్జర్‌తో మొబైల్ , ఆర్థిక వ్యవస్థ రెండింటినీ ఛార్జ్ చేయడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి ఈ అవార్డు మమ్మల్ని ప్రేరేపిస్తుంది.

2047 నాటికి భారతదేశం తన వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పోతున్నందున, ‘కెడిఎం భారత్ కా ఛార్జర్’ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటానికి, మేక్ ఇన్ ఇండియాతో భారత్‌ను శక్తివంతం చేయడానికి దోహదపడుతోంది. “హర్ ఘర్కెడిఎం” అనే మా లక్ష్యంను సాధించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. 2030 నాటికి, మేము 10 కోట్ల కుటుంబాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే, 2030 నాటికి 50,000 మంది మహిళలకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాము”అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad