Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈనెల 13న 'క్విట్‌ కార్పొరేట్స్‌ డే'ను జయప్రదం చేయండి

ఈనెల 13న ‘క్విట్‌ కార్పొరేట్స్‌ డే’ను జయప్రదం చేయండి

- Advertisement -

పోస్టర్‌ ఆవిష్కరణలో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్ల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలను నిరసిస్తూ ఈనెల 13న నిర్వహించతలపెట్టిన క్విట్‌ ‘కార్పొరేట్స్‌ డే’ను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో వాణిజ్య ఒప్పందాల కాపీలను దహనం చేయాలనీ, రాస్తారోకోలు, ప్రదర్శనలు, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని సూచించింది. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ గౌడ్‌ హాలులో ఎస్‌కేఎం నేతలు పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్‌, పశ్యపద్మ, కెచ్చల రంగయ్య, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఆర్‌ వెంకట్రాములు, నాగిరెడ్డి, రవీందర్‌గౌడ్‌ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చేసిన బెదిరింపు చర్యలను ఖండించారు. ఆయా దేశాలపై ఆమెరికా సుంకాలు విధించి, ఆ పేరుతో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థల దురాశ కోసం కేంద్ర ప్రభుత్వం జల్‌, జంగల్‌, జమీన్‌ (నీరు, అడవులు, భూమి) హక్కులపై వినాశకరమైన దాడిని కొనసాగిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను, సేవలను ప్రయివేటీకరిస్తున్నదని చెప్పారు. సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందాలపై ఇండియా సంతకం చేయడమంటే ఆ దేశాలకు లొంగిపోవడమేని పేర్కొన్నారు. ఇది విదేశీ కార్పొరేట్‌ లాభాల బలిపీఠం వద్ద మన రైతులు, కార్మికుల ఆర్థిక స్వాతంత్య్రాన్ని త్యాగం చేసే ఒప్పందమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టాల వల్ల వ్యవసాయ సమాజాన్ని నాశనం చేయడంతోపాటు దేశం ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఖరి మనదేశంలో పారిశ్రామికీకరణను, నిరుద్యోగాన్ని పెంచుతున్నదని చెప్పారు. ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబనపై ఇది ప్రత్యక్ష దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా బ్రిటీష్‌ కార్పొరేట్‌ టేకోవర్లకు మన దేశ ఆరోగ్య సంరక్షణ బాధ్యతను అప్పగిస్తున్నారని తెలిపారు. ఔషధ గుత్తాధిపత్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా జరగనున్న క్విట్‌ కార్పొరేట్‌ ఉద్యమంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, దేశభక్తి గల పౌరులు పెద్ద ఎత్తున పాల్గొలని వారు పిలుపునిచ్చారు.
డిమాండ్లు
4సుంకాలతో బెదిరిస్తున్న ట్రంప్‌ విధానాలను భారతదేశం తిరస్కరించాలి
4అన్ని దేశాలతో వ్యాపారం చేసేందుకు ఆయా దేశాల సార్వభౌమ హక్కులను హరించడం మానుకోవాలి
4ఒప్పందాలను పార్లమెంటులో ఆమోదించకుండా వెంటనే సమీక్షించాలి.వాటిని మార్చాలి
4కార్పొరేట్‌ దోపిడీని నిరోధించాలి.
4అమెరికా, ఇండియా వాణిజ్య ఒప్పందాల
కోసం కొనసాగుతున్న చర్చలను ఆపాలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -