– పాల్గొన్న గ్రామ సర్పంచ్ కే. చంద్రకళ
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి జిపి పరిధిలోని కే. కల్లాలి తాండ గ్రామంలో సోమవారం అంగన్వాడీ టీచర్ రాధా ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కడదొడ్డి చంద్రకళ, ఉపసర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాధా మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమమే ఒక పండుగ మాదిరిగా నిర్వహిస్తామని అన్నారు.
ముఖ్యంగా పిల్లలు బరువు తక్కువ ఉండడం, పౌష్టికాహారం లేక బక్క చిక్కిపోయే పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలలో అన్నప్రాసన కార్యక్రమం, అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టడం వలన వారికి రుచికరమైన ఆహారాలపై మక్కువ పెరుగుతుందని తెలిపారు. అనంతరం నిత్యం వారు పౌష్టికాహారం తినడం వల్ల బరువు పెరుగుతుందని, శరీరం బలిష్టంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలితలంలకు, గర్భవతులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఆశా కార్యకర్తలు, బాలింతలు, గర్భవతులు, పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



